ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టుల వద్ద గస్తీ కాస్తున్నట్లు ఎస్పీ మేరీ తెలిపారు. గడిచిన 24 గంటల నుండి ఆదివారం రాత్రి ఏడు గంటల సమయం వరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా రూ. 3,61,000 వేల నగదు, 13.97 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు.