స్టాక్ ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న ఆన్లైన్ మోసాలపై ప్రజల అప్రమత్తంగా ఉండాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో సిఐ నాగమల్లేశ్వరరావు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన కార్యాలయంలో హెచ్చరించారు. వాట్సప్ ఇతర సామాజిక మాధ్యమాలలో వచ్చే గ్రూప్ చాట్ లు సందేశాలను గుడ్డిగా నమ్మవద్దని సూచించారు. అధిక లాభాలు వస్తాయని చెప్పే మాటలకు మోసపోకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.