ఓబుళవారిపల్లి: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ… ఇద్దరి మృతి అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్ద చెన్నకేశవస్వామి గుడి సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రోడ్డు దాటుతున్న ముగ్గురిని ఢీకొట్టింది. మంగళంపల్లికి చెందిన అంకమ్మ (70), రామచంద్రయ్య (50) అక్కడికక్కడే మృతి చెందగా, మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు