నాగలాపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నాగలాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సోమవారం జరిగింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా పంపిణీ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను అడ్డుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు ఇకపై ఈ కార్డును ఉపయోగించాలన్నారు.