రేపు జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గుర్తించిన వినాయక నిమజ్జన ప్రాంతాలను గురువారం రోజున అయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రాద్ మాట్లాడుతూ. నిమజ్జనం కోసం వచ్చే భక్తుల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండ చూడాలని, విగ్రాహల నిమజ్జనం కోసం అవసరమైన క్రేన్లను సిద్దం చేయాలనీ సూచించారు. ఆయా నిమజ్జన ప్రాంతాల్లో శానిటేషన్, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని, లైటింగ్, మంచినీటి సౌకర్యం, ఏర్పాట్లు ఉండేలా చూడాలని ఆదేశించారు.