దిలావర్పూర్ మండలం రత్నాపూర్ కండ్లి గ్రామానికి చెందిన అరుణ్, శ్రీధర్లకు చెందిన గొర్లు కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. దీంతో వారి ఇంట పండగ వేల విషాదం అలుముకుంది. గతంలో తల్లిదండ్రులను కోల్పోయారు. ఎవరూ లేని అన్నదమ్ములు ఇంటర్ పూర్తి చేసి కొన్ని గొర్లను కొనుగోలు చేసి జీవనం కొనసాగిస్తున్నారు. ఇలాంటి తరుణంలో 22 గొర్రెలు చనిపోగా 7 గాయపడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదని ఆదుకోవాలని కోరుతున్నారు.