ఆళ్లగడ్డ వైపీపీఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన జి. రాజశేఖర్ రెడ్డి గురువారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను కలిశారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యే ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అభివృద్ధితో పాటు, మెరుగైన ఫలితాలను సాధించాలని ఎమ్మెల్యే సూచించారు.