ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం “Sunday’s on Cycle” కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్ని సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఏ ఆర్ డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో వాహనాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల వ్యాయామం తగ్గిపోతోందని, దాని ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. రోజుకు కొంత సమయం సైక్లింగ్ చేస్తే, అది శారీరకంగా, మానసికంగా మనల్ని బలంగా ఉండడానికి వీలుగా ఉంటుందన్నారు