ప్రకాశం జిల్లా బెస్తవారిపేటలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త బ్రహ్మయ్య కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు పరామర్శించారు. బ్రహ్మయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు కంభం వచ్చిన అన్నా వెంకట రాంబాబు కార్యకర్త మృతి పై విచారం వ్యక్తం చేశారు. బ్రహ్మయ్య కంభం మండలం ఎంతో చురుకైన కార్యకర్త అని అన్నా వెంకట రాంబాబు కొనియాడారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో కంభంలో అన్నా వెంకట రాంబాబు పర్యటించారు.