గణనాథుడు దీవెనలు రాష్ట్ర ప్రజలపై సుభిక్షంగా ఉండాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం విజయవాడ నగర శివారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వైసీపీ నేతలు పాల్గొని పూజలు నిర్వహించారు