ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని 16వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగునున్న ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ కోరారు. రైల్వే కోడూరులో ఆటో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ఫ్రీ బస్సు వల్ల ఆటో కార్మికులకు జీవనోపాధి కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు ఆకలితో రోడ్డులో పడే అవకాశం ఉంది కావున ప్రభుత్వం కోరారు.