రాహుల్ గాంధీకి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని, దేశానికి కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ధ్వజమెత్తారు. రాజమండ్రిలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సర్దార్ పటేల్ను అడ్డుకుని, ఓట్ల చోరీతో నెహ్రూని ప్రధానిని చేసిందని ఆరోపించారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనని నకిలీ పార్టీ కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.