సెప్టెంబర్ 6 వ తేదీన విజయవాడలో విద్యార్థులపై జరిగిన దాడిని ప్రజలంతా ఖండించాలని వామపక్ష, ప్రజా సంఘాలు ఆదివారం సుందరయ్య భవనం ఎదుట నిరసన కార్యక్రమం చేశారు.ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్ 6 వ తేదీన రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ విజయవాడలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు పాసవికంగా అనిచి వేయడాన్ని ఖండించారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బోధనా సిబ్బంది, బోధ నేతర సిబ్బంది పూర్తిస్థాయిలో అన్ని ప్రభుత్వ విద్యాలయాల్లో, కళాశాలలో నియమించాలని, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలన్నారు.