కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ మచిలీపట్నంలో మాట్లాడుతూ జిల్లాలో రైతులకు యూరియా నిరంతరాయంగా సరఫరా అవుతుందని తెలిపారు. రైతులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యూరియా కొరత లేకుండా చూస్తున్నామని, అన్ని గ్రామాలకు యూరియా అందుబాటులో ఉంటుందని, వ్యవసాయ శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు.