ఓర్వకల్లు ప్రజాసంఘాల కార్యాలయంలో సిపిఎం అఖిలభారత మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి వర్ధంతిని గుర్తించుతూ ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం సిపిఎం మండల కార్యదర్శి బి.నాగన్న, సిఐటియు, రైతుసంఘం, కేవిపిఎస్ నాయకులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకున్నారు. ఏచూరి ఆశయ సాధనలో పాటుపడాలని పిలుపునిచ్చారు.