యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఆర్జిత పూజలు దైవదర్శనాలతో ఆలయం అత్యధిక శోభను సంతరించుకుంది ప్రత్యేక ఉచిత దర్శన సముదాయాలలో భక్తులు బారులు తీరారు ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ శివాలయంలోనూ ఆరాధన పర్వాలు కొనసాగాయి. కొండకింద మండపంలో భక్తులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించుకొని మొక్కలు తీర్చుకున్నారు భక్తుల వాహనాలతో పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి.