ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉంటుందని, అలాంటి వారి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకోని గురువారం జడ్పి హాల్లో లో గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ కలిసి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతర గేయాన్ని ఆలపించారు. అనంతరం చిన్నారులు చేసిన సంస్కృతిక నృత్యాలను తిలకించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన 72 మంది ఉపాధ్యాయులను సన్మానించారు