కే.గంగవరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మంగళవారం నిరసన జరిగింది. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటర్ల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ప్రజా సంఘాల నాయకులు వెంకటేశ్వరరావు, భీమశంకరం, సిద్దు డిమాండ్ చేశారు. ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై విద్యుత్ భారం మోపొద్దని నినాదాలు చేశారు.