సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మధ్యాహ్నం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ సుభాష్ రావు ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ పలువురిపై దాడి చేసి గాయపరచాయన్నారు. చిన్నారులు,మహిళలు, వృద్ధులు కాలినడకల వెళ్లేందుకు భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. వీధి కుక్కల వల్ల పలువురు ద్విచక్ర వాహనాలపై నుండి పడి గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయని, అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కుక్కలను తరలించాలని కోరారు.