బయ్యారం మండల కేంద్రంలోని ఉప్పలపాడు లో యూరియా కట్టల కోసం రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలు రైతులు మాట్లాడుతూ యూరియా కట్టలు లేక మట్టిని నమ్ముకొని వ్యవసాయం చేసే మాకు కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా కట్టలు అందించలేని పరిస్థితుల్లో ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ప్రభుత్వాన్ని చెప్పకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు. ఇకనైనా కళ్ళు తెరుచుకొని రైతులందరికీ యూరియా కట్టలు అందించాలని రైతులు పేర్కొన్నారు. ఇలానే యూరియా రైతులకు అందచేయకపోతే సొసైటీల ముందు ధర్నాలు చేపట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన బుద్ధి చెబుదామని రైతులు పేర్కొంటున్నారు.