శనివారం రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వినాయక నిమజ్జనోత్సవాల కార్యక్రమంలో భాగంగా బిజీగా ఉన్నప్పటికీ, బాలాపూర్ గణేశుని దర్శించుకుని తిరిగి వస్తున్న సమయంలో టు వీలర్ పై ప్రయాణిస్తూ సెల్ఫ్ ఆక్సిడెంట్ జరిగి ఒక జంట ప్రమాదంలో గాయపడ్డారు. విషయం గమనించిన వెంటనే వాహనాన్ని ఆపి, సిబ్బందితో కలిసి ప్రధమ చికిత్స అందించారు. ఈ చర్యకు స్థానికులు పోలీస్ కమిషనర్ సుధీర్ బాబును ప్రశంసలు కురిపించారు. గాయపడిన దంపతులు కూడా చికిత్స పొందిన తర్వాత క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.