అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండల కేంద్రంలో లక్ష్మీదేవి అనే వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన శర్మాస్వలీ ఇటుకతో దాడి చేసి గాయపరిచిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర గాయాలు పాలైన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఒక్కసారిగా ఇటుకతో దాడి చేయడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.