సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల మార్కెట్ కమిటీ చైర్మన్, పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ శెట్కార్ లు పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మీ శేషారెడ్డిని, మరియు పాలకవర్గాన్ని మంత్రి దామోదర ముందుగా పూలమాలలు వేసి శాలువాతో సన్మానించి అనంతరం ప్రమాణ స్వీకారం చేయించారు.