అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్కు న్యాయం చేయకపోతే ఆత్మహత్యకు మరోసారి పాల్పడతానని అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మారుతి తెలిపారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన అతనిని గమనించిన పోలీసులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతను మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించాడు.