మోస్రా మండలంలోని గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని మోస్రా తాహాసిల్దార్ రాజశేఖర్ కు మండల బిజెపి నాయకులు శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. మోస్రా వెంకటేశ్వర ఆలయం నుండి కుర్నాపల్లి రోడ్డు వరకు, చింతకుంట రోడ్డు నుండి గోవూర్ కాంటా వరకు ఆర్ అండ్ బి రోడ్డు పనులు పూర్తికానందున వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పనులు పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టాలని వినతిపత్రంలో కోరారు. మండల బిజెపి ప్రధాన కార్యదర్శి గణేష్, హన్మ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ సుదర్శన్ గౌడ్, భూపాల్ రెడ్డి, రాజారెడ్డి, లింగం పాల్గొన్నారు.