విజయవాడ గొల్లపాలెం గట్టు క్వారీ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి తన్నీరు నరేంద్రకు చెందిన ఇల్లు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న 50వ డివిజన్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బంక చాముండేశ్వరి అక్కడికి చేరుకొని పరిశీలించి నష్టపరిహారం అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.