రఘునాథపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ సభకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎం రాంబాబు తో కలిసి అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ పాల్గొని పనుల జాతర-2025 కార్యక్రమం ప్రారంభించారు.ఈ గ్రామసభలో ఆసక్తి గల లబ్దిదారులు పశువుల కొట్టాలు,వ్యక్తిగత సోక్ పిట్‌ల కోసం దరఖాస్తులను అందజేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పింకేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు (నరేగ) ఎంసిసి పనుల జాతరలో అర్హులైన వారందరూ తప్పనిసరిగా పాల్గొనాలన్నారు.జాబ్ కార్డు లేని వారు పొందాలని,పనుల జాతర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.