అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో బుధవారం జరుగుతున్న సూపర్ సిక్స్ -సూపర్ హిట్ సభకు కంబదూరు, కుందుర్పి మండలాల నుంచి టీడీపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలి వెళుతున్నారు. బస్సులు, జీపులు, ఆటోలలో తరలి వెళుతున్నారు. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం పార్టీ, జై జనసేన పార్టీ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా, ఉల్లాసంగా తరలి వెళుతున్నారు. ఎక్కడ చూసినా సందడి, కోలాహలమే కనిపిస్తున్నది.