గత మూడు తరాలుగా నగరంపాలెం మస్తాన్ దర్గా వెనుక పాత వస్త్రాల వ్యాపారం చేసుకుంటున్న తమను 8 నెలల క్రితం అర్ధాంతరంగా తొలగించారని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని జిల్లా కలెక్టర్ ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో బాధితురాలు మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీల ముసుగులో తమను అక్కడ నుండి తొలగించారని తెలిపారు. తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమకు వ్యాపారం చేసుకునేందుకు ఒక ప్రాంతాన్ని కేటాయించాలని కోరారు.