ఆళ్లగడ్డలో గురువారం కురిసిన వర్షం రైతులకు నష్టం మిగిల్చింది. నోటికాడికి వచ్చిన ముద్ద నేలపాలు కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులతో కూడిన వర్షంతో కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది. రైతులకు టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో ధాన్యం తడిసి నీటిలో కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని తరగు లేకుండా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.