బాల్య దశలో ప్రేమ పేరుతో మోసపోవద్దని బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ సూచించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు బీర్కూర్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాలు ,మత్తుపదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. మూఢనమ్మకాలను నమ్మవద్దని ,మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని ,ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. విద్యార్థులు తల్లిదండ్రులకు గ్రామస్తులకు ఈ విషయాలపై అవగాహన కల్పించాలని సూచించారు.