ప్రకాశం జిల్లా కు సంబంధించిన బార్ల నూతన పాలసీ ఆధారంగా బార్ లైసెన్సులను లాటరీ ద్వారా శనివారం రోజు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ హేమంత్ నాగరాజు మరియు డిఆర్ఓ ఓబులేష్ ఆధ్వర్యంలో బార్ లైసెన్స్ వేసినటువంటి వ్యక్తులకు నంబర్లను కేటాయించి వాటి ఆధారంగా లాటరీని తీశారు ప్రకాశం జిల్లాలో 26 బార్లు మరియు గీత కార్మికులకు మూడు బార్లు కేటాయించగా సరైనటువంటి టెండర్లు వచ్చిన 17 షాపులకు మరియు గీత కార్మికుల కేటాయించిన మూడు షాపులకు సంబంధించిన లాటరీ ప్రక్రియను శనివారం పూర్తి చేశారు లాటరీలో విజేతలుగా నిలిచినటువంటి వ్యక్తులకు షాపుల లైసెన్సులను కేటాయించారు