పాణ్యం నియోజకవర్గ ప్రజలు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలకు,ముస్లిం మైనారిటీలకు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం మత పెద్దలు ఏర్పాటు చేసిన మిలాద్ - ఉన్ - నబీ వేడుకల్లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ... ముస్లిం మైనారిటీల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి, ఆధ్యాత్మిక పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మైనారిటీలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.