గుత్తి మండలం జక్కల చెరువు వద్ద గురువారం ఓ వ్యక్తిని ఎక్కించుకోలేదని గ్రామస్తులు, ప్రయాణికులు ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్, కండక్టర్ పై దాడి చేశారు. దీంతో శుక్రవారం తాడిపత్రి నుంచి గుత్తికి, గుత్తి నుంచి తాడిపత్రి కి వెళ్లే హైర్ బస్సులను నిలిపివేశారు. కండక్టర్లు, డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దీంతో ప్రయాణికులు బస్సులు లేక ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే బస్సులు ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.