పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసిపి కార్యకర్తలను వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో పరామర్శించారు. కార్యకర్తలకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని తప్పుడు కేసులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వినుకొండలో టిడిపి అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారు ఆయన హెచ్చరించారు.