జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో, ముఖ్యంగా ఎరువుల సరఫరాపై రైతుల సమస్యలను మరింతగా తెలుసుకోవడానికి, వారి సూచనలు మరియు సలహాలను స్వీకరించడానికి, ఈ కార్యక్రమాన్ని మరో వారం పాటు కొనసాగించాలనే నిర్ణయం కలెక్టర్ డా. బి.ఆర్. అంబేద్కర్ తీసుకున్నారు.సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజూ సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల వరకు 9441957315 నంబరుకు రైతులు ఫోన్ చేసి యూరియా సరఫరాలో సమస్యలు, తెలియజేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.