హైదరాబాదులో గత కొన్ని రోజుల క్రితం వరుస సంఘటనలో కేబుల్ వైర్లు తాకి కొంతమంది మృతి చెందడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగించే కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు పర్మిషన్ లేకుండా ఉన్న అనధికార కేబుల్ వైర్లను విద్యుత్ సిబ్బంది తొలగింపు చర్య ప్రారంభించారు. ముందుగా ఆలంపల్లి రోడ్డులో విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను తొలగించారు.