కళ్యాణదుర్గంలో గురువారం తమ డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ మాట్లాడారు. అంగన్వాడీల కు జీతాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.