ఆగస్టు 4 5 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా సోంపేట లో జరిగే సిఐటియు జిల్లా 12వ మహాసభలు విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు శనివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న సిఐటియు కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు హాజరవుతారని అధిక సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు, అంగన్వాడి ఆశ శ్రామిక అసంఘటిత కార్మికులు హాజరుకావాలని ఆయన కోరారు.