ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం గంటాపురం గ్రామానికి చెందిన వృద్ధులు, దివ్యాంగులు బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం ముందు బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిరసనకు దిగారు. ఈనెల తమకు పెన్షన్లు ఇవ్వలేదని అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వస్తున్న పెన్షన్లతోనే తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని పెన్షన్లు తొలగించి తమ పొట్ట కొట్ట వద్దని గ్రామస్తులు అధికారులకు తెలిపారు. స్థానిక ఎంపీడీవో నిరసనకారులతో మాట్లాడి పెన్షన్ అందేలా చూస్తామని వారికి హామీ ఇవ్వడంతో పెన్షన్ దారులు నిరసన విరమించారు.