మంత్రాలయం:మహానేత, దివంగత సీఎం డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు మంత్రాలయం నియోజవర్గం లోని నాలుగు మండలాలలో వైసిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఆయా మండలాల్లో వైసిపి నాయకులు వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైయస్సార్ ఎనలేని సేవలు చేశారని వైసిపి నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.