మారేడుమిల్లి మండలం వాలి సుగ్రీవుల ఘాటి వద్ద జాతీయ రహదారికి అడ్డంగా శుక్రవారం సాయంత్రం ఓ ఆయిల్ ట్యాంకర్ నిలిచిపోయింది. దీంతో వాహనాలు రోడ్డుకు కిరువైపులా భారీ ఎత్తున నిలిచిపోయాయి. వాహనదారులు రోడ్డుపైనే వేసి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.