మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని, పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన సర్వస్వాన్ని దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు సురేందర్ గౌడ్, గంగాగౌడ్, రమణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చిన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.