కలికిరి మండలం కలికిరి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సి.వి.భాస్కర్ రెడ్డి అండ్ సన్స్ ఎరువుల దుకాణాన్ని వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ అధికారులు సంయుక్తం గా శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. దుకాణంలోని 3.4 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వల్ని మరియు స్టాక్ రిజిస్టర్ లని,బిల్లులను పరిశీలించి సరిపోల్చుకున్నారు. షాపు లో అందుబాటులో ఉన్న ఎరువుల వివరముల కు సంబంధించిన బోర్డులు షాపు లోపల పెట్టుకోవడాన్ని గుర్తించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఎరువుల దుకాణం ముందు తప్పనిసరిగా స్టాకు మరియు ధరలను సూచించే బోర్డులను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు