మోపిదేవి రోడ్డు ప్రమాదంలో ఫాస్టర్ మృతి రోడ్డు ప్రమాదంలో ఫాస్టర్ మృతి చెందిన ఘటన శనివారం రాత్రి 8 గంటల సమయంలో స్తానిక మోపిదేవి మండలం కప్తానుపాలెం వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..కొల్లూరు మండలం జువ్వలపాలెంకు చెందిన పాస్టర్ జక్రయ్య చల్లపల్లిలో పని నిమిత్తం వచ్చి ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు.కోదాడకు చెందిన కారు రేపల్లె వైపు నుంచి వస్తూ బైక్ ను ఢీ. కొట్టడంతో తలకు బలమైన గాయాలై జక్రరయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.