తిరుమలలో వరాహ స్వామి దేవస్థానాన్ని రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచాలని టిటిడి చైర్మన్ ను పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ కోరారు. తిరుమల శ్రీవారి తలుపులు రాత్రి 12 గంటల వరకు తెరచి ఉంచి వరాహ స్వామి ఆలయాన్ని ప్రతిరోజు రాత్రి 9 గంటలకే మూసి వేయడం వల్ల భక్తులు నిరుస్తాహ పడుతున్నారని తెలిపారు పండితులతో చర్చించి రాత్రి 11 గంటల వరకు తెరచి ఉంచితే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు.