మున్సిపాలిటీలోని పలు షాపుల్లో సెల్లార్ల నుంచి నీటిని తొలగిస్తున్న ఫైర్ సిబ్బంది మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని పలు షాపుల్లో చేరిన వర్షపు నీటిని ఫైర్ సిబ్బంది తొలగిస్తున్నారు. గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలోని పలు సెల్లార్లలో వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఫైర్ సిబ్బంది శుక్రవారం ఉదయం షాపుల వద్ద ఉన్న సెల్లార్ల నుంచి నీటిని పంపులు ఏర్పాటు చేసి తొలగిస్తున్నారు.