పాంబండ రామలింగేశ్వర దేవాలయం నాగుపాము దర్శనం శుక్రవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండ ఎలికిచర్ల గ్రామంలోని పాంబండ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం లో భక్తులకు నాగుపాము దర్శనమిచ్చింది. శ్రావణమాసం శుక్రవారం నాగుపాము దర్శనమివ్వడాన్ని అదృష్టంగా భావించి నాగుపాముకు భక్తులు అత్యంత భక్తితో పూజలు నిర్వహించారు. కొద్దిసేపటి తర్వాత ఆలయ సిబ్బంది పామును అడవి ప్రాంతంలోకి వదిలేశారు. ఇలాంటి సంఘటనలు అరువుగా చోటు చేసుకుంటాయని భక్తులు తెలిపారు.