పరవాడ. ఫార్మా సిటీలో డెక్కన్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ కెమిస్ట్ ఎం పోల్ నాయుడు 41 సోమవారం తెల్లవారి ఆరు గంటలకి మృతి చెందాడు. దీనిపై సమగ్ర విచారణ చేసి కార్మిక కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం గని శెట్టి పరిశ్రమలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితుడికి కోటి రూపాయలు పరిహారంతో పాటు ఇంట్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.