రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించినా పల్నాడు ప్రాంతంలోని కొంతమంది వ్యాపారులు యూరియా అధిక ధరలకు పక్కరాష్ట్రాలకు విక్రయిస్తున్నారని దాచేపల్లి సిఐ భాస్కర్ తెలిపారు.గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిఐ వివరాలు వెల్లడించారు.తాజాగా కారంపూడి పట్టణానికి చెందిన ఓవ్యాపారి సరైన పత్రాలు లేకుండా యూరియాను తెలంగాణ తరలిస్తుండగా పొందుకుల చెక్పోస్ట్ వద్ద రెండు టాటా ఏసీలను,రెండు బొలెరో వాహనాలను పట్టుకుని స్టేషన్కు తరలించామన్నారు.ఈ సంఘటనపై విచారణ జరుగుతున్నట్లు దాచేపల్లి సిఐ తెలిపారు.